Friday, 25 March 2016

లక్ష్మీ నరసింహస్వామి మహత్యం :

లక్ష్మీ నరసింహస్వామి మహత్యం :
పూర్వ కాలంలో హిరణ్యక శిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు . ఇతను లీలావతి అనే ఆమెను వివాహం చేసుకొనెను . ఇతను తన చుట్టూ ఉన్న రాజ్యాలలో ఉన్న రాజులను ఓడించి రాజ్యములను ఆక్రమించు కొనెను . ఇతను ఒకరోజు తన బార్యతో నేను అడవిలో తపస్సుకు వెళుతున్నాను అని చెప్పి నీవు జాగ్ర త్త అని అడవికి వెళ్ళెను . హిరణ్యకశిపుడు అడవికి వెళ్ళి ఈశ్వరుని గురించి తపస్సు చేసెను . ఇది ఇలాఉండగా ఇతని బార్య లీలావతి  నెలతప్పి గర్బం ధరించెను . ఈమె పతివ్రతా శిరోమణి . పతి అడవికి వెళ్ళినాడని చింతతో మధనపడుతుండగా నారదమహర్షి ఆమెను చూసి అమ్మా నీవు బాధపడకు నీపతి వచ్చే వరకు నీవు ఆశ్రమంలో బగవంతుని సేవ చేసుకొంటూ ఉండు అని ఆమెను తనతో తీసుకొని వెళ్ళెను . ఆమె ఆశ్రమంలో ప్రతీ రోజూ  బగవంతుని పూజిస్తూ ఉండేది .ఆమె కడుపులో ఉన్న బాలుడు కూడా ఆమె చేస్తున్న పూజలన్నీ ఈ బాలుడుకూడా వింటూ ఉండేవాడు .
ఒక మంచి ముహూర్తాన ఆమె ఒకబాలుడికి జన్మ ఇచ్చింది . నారద మహర్షి ఈ బాలుడికి ప్రహ్లాదుడు అనే నామకరణం చేసెను . ఆమె బర్త హిరణ్యకశిపుని తపస్సు పలించి పరమశివుడు ప్రత్యక్షమయ్యెను . బక్తా నీకు ఏమి
వరం కావలెనో కోరుకోఅనెను . అప్పుడు హిరణ్యకశిపుడు నాకు ఎటువంటి జీవరాసితో కానీ  మానవుడు తోను కానీ మరణం సంబవించ కూడదని వరం కోరుకొనెను . అప్పుడు పరమశివుడు తధాస్తు అని దీవించెను . తర్వాత ఇతను అడవి నుండి తిరిగి రాజ్యమునకు వచ్చెను . రాజ్యంలో తన బార్య లేదని గ్రహించి తన బార్య దగ్గరకు వెళ్ళి తన బార్యను తీసుకొని వచ్చెను . తన పుత్రుని చూసి సంతోషంతో ఉండెను .ప్రహ్లాదుడికి ఐదు సంవత్సరాలు నిండిందికావున  ప్రహ్లాదుడికి విద్య నేర్పించడానికి బోధన అబ్యాసనం చేయడానికి హిరణ్యకశిపుడు తన కుమారుని పిలిచి నాయనా నీవు విద్యా బోధనకు ఆశ్రమానికి వెళ్ళు అని ఆశ్రమానికి పంపెను . హిరణ్యకశిపుడు నేనే  బగవంతున్ని అని రాజ్యంలో అందరిని ఓం హిరణ్యకనమః అని నామ స్మరణ చేయవలెనని ప్రకటన చేసెను .
రాజ్యంలోని ప్రజలందరు కూడా హిరణ్యకశిపుడే దేవుడు అని ఇతనికి బయపడి ఆయననే పూజిస్తూజపం చేస్తూ  ఉండేవారు . ఇది ఇలా ఉండగా ప్రహ్లాదుడు తన గురువు దగ్గర విధ్యాబ్యాసం చేస్తున్నాడు . హిరణ్యకశిపుడు ఇతని గురువుకు కూడా తానే దేవుడు అని తన కుమారునికి కూడా చెప్పాలి అని చెప్పెను . గురువు కూడా ప్రహ్లాదునికి మీ తండ్రియే దేవుడుఅని ఓం హిరణ్యాకాయనమః అని ఉపదేశం చేసెను . కానీ ప్రహ్లాదుడు శ్రీమన్ నారాయణుడే బగవంతుడు అని ఓంనమో నారాయణాయనమః అని ధ్యానం చేసేవాడు . దీన్ని చూసినగురువు మీ నాన్న దగ్గర చెప్పకు మా ప్రాణం పోతుంది  ఆయన లేనప్పుడు బగవంతుని స్మరించుకో అని చెప్పెను .

Tuesday, 22 March 2016

ఉగాది శుభాకాంక్షలు

ఉగాది శుభాకాంక్షలు:
తెలుగు క్రొత్త సంవత్సరం ప్రారంబమైనమొదటి  రోజే ఉగాది . ఉగాది పండుగ రోజు మామిడి ఆకులతో పచ్చ తోరణాలు కట్టి వేపాకుల పూతతో తోరణాలను కట్టి అలంకరిస్తారు . అందరు స్నానం చేసుకొని కొత్త బట్టలు ధరించి బాగా అలంకారం చేసుకొని పచ్చి మామిడి కాయలను తెచ్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి బెల్లం వేసి బగవంతునికి ప్రసాదంగా పెట్టి గుడికి వెళ్లి పరమశివునికి ప్రసాదంపెట్టి పూజ చేసేవారు . తర్వాత పచ్చి మామిడి కాయలను తెచ్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి బెల్లం ఉప్పు కారం వేపపూత చింత పండు అన్నిటిని కలిపి తినేవారు . ఇలా తినడం ఎందుకంటే మానవుని జీవితంలో సంతోషం బాధ కోపం అన్నిటినీ సమానంగా అనుబవించాలని దేనికీ బయపడ కూడదని ఇలాచేస్తారు .తెలుగు రాష్ట్రాలవారు తెలంగాణ రాయలసీమ వారు మాత్రమేగాక  ఇంకా కర్ణాటక ప్రజలు కూడా ఈ ఉగాది జరుపుకొంటారు . ఈ ఉగాది పండుగ రోజు ఎక్కడెక్కడో ఉద్యోగాలలో ఉన్న వారు కూడా ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబ సబ్యులతో కలసి పండుగ జరుపుకొనేవారు . ఉగాదికి కలవని వారుజగాదికి కలవరు అన్న సామెత ఉండేది . అందుకే అందరు కలసి ఈ ఉగాది పండుగను జరుపుకొనేవారు . అందరికీ నా హృదయ పూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలుపు తున్నాను .

ముసలి ఎద్దు కథ

గోవు బగవంతునితో సమానం . గోవును ప్రతీ రోజు పూజిస్తే మనకు అన్నీ కష్టాలు తొలగిపోతాయి . మనం నిద్రలేవగానే స్నానం చేసుకొని గోవుచుట్టు మూడు ప్రదిచ్చనలు చేసుకొని నమస్కారం చేసుకోన్నచో మనకు ఉన్న దారిద్ర్యం తొలగిపోతాయి . గోవు ముసలిది అయిపోయింది కదా అని గడ్డి వేయడం దండగ అని వెంకయ్య అనుకొన్నాడు . కానీ గోపన్న సలహా మేరకు గోవును ప్రతీ రోజు నమస్కరిస్తే ధనం వస్తుంది అన్నాడు . వెంకయ్య గోవును ప్రతీ నమస్కరించి దండిగా మేత వేసి పొలంపనులకు వెళ్ళేవాడు . బాగా వర్షాలు పడి పంటలు బాగా పండి మంచి లాబాలు వచ్చాయి . పంటలు బాగా పండడం మాత్రమే కాదు ఇంకా సకల దారిద్ర్యం కూడా తొలగిపోతాయి . కాబట్టి అందరు గో సంరక్షణ చేయండి . అందరు పుణ్యం సంపాదించుకొని సిరి సంపదలతో తులతూగండి . ఇదే విధంగా మానవుడు కూడా ముసలి వాడు అయిపోతాడు కదా ముసలి వాడు అయిపోయాడు ఇక దేనికీ పనికి రాడు అని భోజనం పెట్టకుండా ఇక నీవు వెళ్ళవచ్చు అని చెపుతామా లేదుకదా . మనం చిన్న వయస్సులో మన అమ్మా నాన్న ఏవిధంగా చుసుకోన్నారో మనం కూడా మన అమ్మ నాన్న లను అదేవిధంగా చూసుకోవాలి . 

Saturday, 12 March 2016

ముత్యాల ముగ్గులు

ముత్యాల ముగ్గులు :

ప్రతి స్త్రీ ప్రతీ రోజు ఉదయాన్నే నిద్రలేచి తన ఇంటి ముందు (కలేపు) నీళ్ళు చల్లి ఊడ్చి ముగ్గులు పెట్టాలి . అప్పుడే ఆ ఇంటికి అందం .ఇంటి ముందు ముగ్గులు ఉంటే చాలు చూడడానికి అందంగా ఉంటుంది . ఇలా శుభ్రంగా ఏ ఇల్లు అయితే ఉంటుందో యింట్లో లక్ష్మీ దేవి ఉంటుంది . లక్ష్మీదేవికి కూడా ముగ్గులు అంటే చాలు ఇష్టం . పూర్వ కాలంలో లక్ష్మీ దేవి వేకువజామున వీధిలో నడుచుకొని ఏ ఇంటికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఒక ఇంటికి వెళ్ళింది . యింట్లో అందరు నిద్ర పోతున్నారు . అది చూసి వెనక్కి వెళ్ళిపోయింది . తర్వాత మరో ఇంటికి వెళ్ళింది .ఆ  యింట్లో ఆ ఇంటి ఇల్లాలు తల విరబోసి పేనులు చూసుకొంటూ తల దువ్వు కొంటూ కనిపించారు .
తర్వాత లక్ష్మీదేవి మరో ఇంటికి వెళ్ళింది . ఆ ఇంట్లో ఇల్లాలు ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిముందు నీళ్ళు (కలేపు)చల్లి ముగ్గులు పెట్టి పూజచేస్తూ కనిపించింది . దీన్ని చూసిన లక్ష్మీ దేవి ఆ ఇంట్లోనే కూర్చున్నది. ఆ ఇల్లు ఐశ్వర్యం తో సిరి సంపదలతో తుల తూగుతూ విరాజిల్లింది . అందుకే మనం కూడా ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసిఇంటి ముందు  ముగ్గులు  పెట్టాలి . మనకు పండగలు వస్తే చాలు మొదట ముగ్గులు పెడతాము  . ముగ్గులు పెట్టగానే పండగ వచ్చినట్టే అనిపిస్తుంది . ముఖ్యంగా సంక్రాంతి పండుగ వస్తే మొదట ముగ్గులు పెడతారు . సంక్రాంతి పండుగ అంటే ముగ్గులు పండుగ అంటారు కదా .

Thursday, 10 March 2016

గోమాత నమస్తే నమస్తే నమో నమః

గోమాత నమస్తే నమస్తే నమో నమః

గోవులో అన్నీ దేవతలూ నివసిస్తున్నారు . గోవును పూజించడం వలన అన్నీ దేవతలను పూజించే సౌభాగ్యం కల్గుతుంది . పూర్వం శ్రీకృష్ణుడు ఆవులమందలను కాచినాడు గోవులు అంటే శ్రీకృష్ణ పరమాత్మునికి చాలా ఇష్టం .
బ్రహ్మ ఈశ్వరులు కూడా ఆవు దూడగా ఉద్బవించి కలియుగ శ్రీనివాసుని ఆకలి తీర్చారు . గోపూజ చేయడం వలన మన కర్మలు అన్నీ తొలగి పోతాయి . ఆవు మనకు పాలు ఇస్తుంది . పాలు పెరుగు వెన్న నెయ్యి అన్నీ గోవు ద్వారానే లభిస్తుంది .గోవు మూత్రం పేడ ఎరువుగా ఉపయోగపడుతుంది . మనకు నిద్ర మత్తుగా సోమరిగా ఉన్నప్పుడు గోమూత్రంతో ముఖం కడుక్కోవడం వలన ఏదో తెలియని ఫ్రెష్ నెస్ లభిస్తుంది .

సూర్యనారాయణా

సూర్యనారాయణా :

ఓం సూర్య నారాయణా
దివాకరా ప్రభాకరా
రవికరా దినకరా భాస్కరా సూర్యనారాయణ
నమస్తే నమస్తే నమో నమః!


మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవం సూర్యభగవానుడు . సూర్యుడు లేకపోతే మనకు వెలుగు లేదు మొత్తం చీకటే కదా . అందరూ కూడా ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకోవలెను . తర్వాత అన్నీ పనులను చేసుకోవడం మంచిది . సూర్యుడు మనకు ఎన్నో విధాలుగాఉపయోగపడుతున్నాడు . సూర్యుడు శ్రీ మన్ నారాయణుని కనులతో సమానం ఆయన కన్నులతోనే మనకు వెలుగు ఇస్తున్నాడు . సూర్యుడు లేదంటే ఈ భూ ప్రపంచమే లేదు . సూర్య కిరణాల వలెనే మనకు ఆక్సిజన్ లభిస్తుంది . సూర్యుని వలెనే ఎండ లభిస్తుంది కదా ఎండ వలెనే పాడి పంటలు పండుతున్నాయి . పంటలు పండటం వలెనే మనకు ఆహారం లభిస్తుంది . ప్రజలు అందరు కూడా ఆహారం కోసమే పనులు చేస్తున్నారు . సూర్యుడు లేదంటే చెట్లు జీవరాశులు ప్రాణులు జంతువులు ఏమి ఉండదు . భగవంతుడు మనకు వెలుగు నిచ్చి ఎల్లవేళలా కాపాడుతున్నాడు . కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సూర్య నమస్కారం చేయండి ఆరోగ్యంగా ఉండండి . సూర్య నమస్కారం చేయడం వలన చెడు గ్రహాలవల్ల వచ్చే కష్టాలు నష్టాలూ అన్నీ కూడా తొలగి పోతాయి . సూర్యనారాయణ అనే నామాన్ని ధ్యానం చేయండి . సూర్యగ్రహణం వల్ల వచ్చే కీడు తొలగిపోతాయి . 

Wednesday, 9 March 2016

శివ రాత్రి మహత్యం :


ఓం హర హర మహాదేవ శంభో శంకరా
బ్రహ్మ మురారి సురార్చిత లింగం 
నిర్మల భాషిత శోభిత లింగం 
జన్మజ దుఖ వినాశకలింగం 
తత్ప్రనమామి సదాశివ లింగం !
దేవ ముని ప్రవరార్చిత లింగం 
కామ దహన కరుణాకర లింగం  
రావణ దర్ప వినాశక లింగం 
తత్ప్రనమామి సదాశివ లింగం!
కుంకుమ చందన లేపిత లింగం 
పంకజ వాసిని   శోభిత లింగం 
సంచిత పాప వినాశక లింగం 
 తత్ప్రనమామి సదాశివ లింగం !
దేవగణార్చిత సేవిత లింగం 
బావై భక్తి భిరేవచ లింగం 
దినకరకోటి ప్రభాకర లింగం 
తత్ప్రనమామి సదాశివ లింగం !

సర్వ సుగంధ సులేపిత లింగం 
బుద్ది వివర్ధన కారణ లింగం 
సిద్ధి సురాసుర వందిత లింగం 
తత్ప్రనమామి సదాశివ లింగం !
అష్టదలోపరి వేష్టిత లింగం 
సర్వ సముద్భవ కారణ లింగం 
అష్ట దరిద్ర వినాశక లింగం 
తత్ప్రనమామి సదాశివ లింగం !
సురగురు సురవర పూజిత లింగం 
సురవన పుష్ప సదార్చిత లింగం 
పరమ పరం పరమాత్మక లింగం 
తత్ప్రనమామి సదాశివ లింగం !
అజ్ఞాష్టకం మిదం పుణ్యం పాప వినాశకం . 



ఒక ఊరిలో ఒక కిరాతకుడు ఉండేవాడు . ఇతడు తన భార్య పిల్లలను పోషించడానికి ప్రతి రోజు అడవికి వెళ్లి జంతువులను వేటాడి చంపి తినే వాడు  కుటుంబాన్ని పోషించేవాడు . ఇలా ఉండగా ఒకరోజు ఉదయాన్నే ఇతని అమ్మ తన కుమారున్ని పిలిచి నాయనా నీవు అడవికి వేటకు వెళ్ళుఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదు  అని చెప్పి సొరకాయ బుంగిలో నీళ్ళు పోసి దానికి ఒక దారాన్ని కట్టి దీన్ని తీసుకొని వెళ్ళు అని చెప్పినది . కిరాతకుడు అలాగే అమ్మా అని సొరకాయ బుంగిని  తీసుకొని అడవికి వెళ్ళాడు . ఇతనికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక జంతువుకూడా  కనిపించలేదు . ఇతను ఉదయం నుంచి పచ్చి నీళ్ళు కూడా త్రాగలేదు . విశేషం ఏమి టంటే ఆ రోజు మహాశివరాత్రి ఇతనికి తెలియకుండా నే ఇతను ఉపవాసం ఉన్నాడు . ఇతను ఈ రోజు రాత్రంతా ఎలాగైనా సరే వన్య మృగాలను వేటాడి తీసుకొన వెళ్ళాలని ఒక మారేడు చెట్టు పైన ఎక్కి కూర్చున్నాడు . వన్య మృగాలు కోసం వేచి చూస్తున్నాడు . ఇతని సౌభాగ్యం ఏమిటంటే అతడు ఎక్కి కూర్చున్న మారేడు చెట్టు క్రింద శివ లింగం ఉంది . ఇతనికి ఒక లేడి జింక కనిపించింది . ఆలేడి పైన గురి పెట్టి చూస్తూ బాణం వేసాడు  అధిగురి తప్పినది . ఇతను బాణం వేసినప్పుడు ఇతని చెయ్యి తగిలి తన దగ్గరున్న సొరకాయ బుంగి లో ఉన్న నీళ్ళు శివ లింగం పైన పడింది.  తర్వాత బాణం విసిరాడు మరల గురి తప్పినది ఇతని చెయ్యి తగిలి మారేడు ఆకులు శివలింగం పైన పడింది . ఇలా ఇతనికి తెలియకుండానే బగవంతుని కృపకు పాత్రుడయ్యాడు . ఈ కిరాతకుని చెయ్యి తగిలి నీళ్ళు మారేడు ఆకులు శివలింగం పైన పడింది పుణ్యం అంటే ఇదే నేమో రాత్రి నాలుగు జాములు అయిపోయింది . ఒకవిధంగా ఇతనికి తెలియకుండానే ఉపవాసం జాగారణ ముగిసింది . ఈ కిరాతకునికి బ్రహ్మ జ్ఞానం కల్గింది పరమశివుడు ప్రత్యక్ష మయ్యి ఏమి వరం కావాలనో కోరుకో అనెను . పరమశివుణ్ణి చూసిఇతడు సంతోషంతో ఎంత భాగ్యం తండ్రి అని నాతప్పులన్ని చమించు తండ్రీ అని పరమ శివుని పాదాలపైన పడ్డాడు . నీ పాపాలన్నీ తొలగి మరుజన్మలో నీవు గుహుడు అనే చక్రవర్తిగా జన్మిస్తావు అంతే గాక శ్రీరామ చంద్రుడు సేవకు పాత్రుడు అవ్వుతావు అని దీవించాడు .కిరతకుడుగా ఉన్న ఇతడు పరమ శివుని భక్తుడిగా కీర్తి చెందినాడు . దీనితో మనకు తెలిసింది  ఏమిటంటే మహా శివరాత్రి రోజు ఉపవాసం జాగారణ వల్ల మనకు పుణ్యం లభిస్తుంది . 

Sunday, 6 March 2016

ఓం నమః శివాయ

ఓం శివాయై నమః
:
వందే శంభు ఉమాపతిం
సురగురుం   వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం
మృగధరం వందే పశూనామ్ పతిం
వందే సూర్య శశాంక వహ్ని నయనం
వందే ముకుంద ప్రియం
వందే భక్త జనాశ్రంచక వరదం
వందే శివం శంకరం !

శివరాత్రి అంటే శివునికి చాలా ఇష్టమైన రోజు . శివరాత్రి రోజు అందరూ తల స్నానం చేసి  ఇంటిని శుబ్రపరచి శివునికి పూజచేయాలి . శివరాత్రి రోజు ఉపవాసం ఉండి శివాలయంకు వెళ్ళి శివుణ్ణి పూజించాలి . . శివరాత్రి రోజు ఉపవాసం ఉండి పైన ఉన్న శ్లోకాన్ని పటిస్తూ భగవంతున్ని ధ్యానం చేయాలి . ఇలా చేయడం వలన సర్వపాపాలు తొలగిపోతాయి . శివరాత్రి రోజు ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం ఉండాలి . ఇలా చేయడం వలన పూర్వజన్మ కర్మలు మన కష్టాలు తొలగిపోతాయి . శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగారం ఉండి మరుసటి రోజు ప్రొద్దున శివునికి పూజచేయాలి . అంతేకాదు ఆరోజంతా పగలు నిద్ర పోకూడదు . ఎంతటి దుష్టుడు కూడా శివరాత్రి రోజుఉపవాసం ఉండి జాగారం ఉండి  పూజ చేస్తే చాలు అతనికి పుణ్య ప్రాప్తి కల్గుతుంది . ఈశ్వరుడు అంటేనే బోలా శంకరుడు ఆయన్ని స్మరిస్తే చాలు కష్టాలన్నీ పటాపంచలు అయిపోతాయి . అన్నీ కోర్కెలు నెరవేరుతాయి . శివరాత్రి రోజు అందరూ ఉపవాసం ఉండి జాగారం ఉండి భగవంతుని కృపకు పాత్రులు కండి . సర్వేజన సుఖినో భవంతు . 

Thursday, 25 February 2016

దర్శకేంధ్రుడు కె రాఘవేంద్రుని క్లాస్ రూమ్ లో ఏ ముంటాయో

దర్శకేంధ్రుడు కె రాఘవేంద్రుని క్లాస్ రూమ్ లో ఏ ముంటాయో :

తెలుగు దిగ్గజ దర్శకుల్లో ముఖ్యంగా చెప్పుకోవలసిన దర్శకుడు కె రాఘవేంద్రరావుగారు అని చెప్పవచ్చు . ప్రస్తుతం భక్తి చిత్రాలు తీస్తున్నారు గానీ .... ఓ దశాబ్దం ముందు వరకూ రక్తికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈయనే అని చెప్పవచ్చు . బ్లాక్ బస్టర్ చిత్రాలకు మారుపేరు ఈయనే అని చెప్పవచ్చు . స్టార్ హీరోలకు సెంటిమెంట్ ఆయన మారుపేర్లు . అంతే కాదు హీరోయిన్లురాఘవేంద్రరావుగారు సినిమాలో నటించడానికి అందరూ ఇష్టపడేవారు . రాఘవేంద్రరావుగారు అంటేనే జనం అంతా ఇష్టపడతారు . ఇక ఆయన సినిమాలో నటించడం అంటే  ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి .రాఘవేంద్రరావుగారు సినిమాలో నటించడం తమ అందం  పది రెట్లు పెరుగుతుందని కొత్త హీరోయిన్లు పాత హీరోయిన్లు అందరూ నమ్మేవారు .
రాఘవేంద్రరావుగారు  శిష్యరికం అంటే మాములు విషయం కాదు . రాఘవేంద్రరావుగారు సినిమాలు తీయడంలో మెలుకువలు నేర్పిస్తే ఎంత గమ్మత్తుగా ఉంటుందో .దర్శకుడు రాజమౌళి గారు కూడా ఆయన  దగ్గర నుంచి వచ్చిన శిష్యుడు . ఇప్పుడు తనే కె ఆర్ ఆర్ క్లాస్ రూమ్ అంటూ శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు . సినిమా తయారీ లో ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వడం ఈయన ఉద్దేశం . దీనికి సంబంధించి ఓ చిన్న యాడ్ తన మీదే రూపొందించి తనే నటించి నెట్ లో పెట్టారు .  రాఘవేంద్రరావుగారు చివర్లో వాచ్ పర్ డీటైల్స్ అంటూ టీచర్ రేంజ్ లో ఊరించారాయన . క్లాసు రూమ్ గురుంచి మరిన్ని విషయాలు ఆయనే చెప్పాలి . మరీ అంతటి దిగ్గజ దర్శకేంధ్రుడు దగ్గర నుంచి ఫిల్మ్ మేకింగ్ లో శిక్షణ పొందేందుకు ఎంతో మంది ఉత్సాహ పడుతున్నారు . చాల మంది శిక్షణ పొందడానికి రెడీ అయి పోతున్నారు .


Monday, 22 February 2016

నితిన్ నిత్యామీనన్ మళ్లీ గుండె జారుతుందా

నితిన్  నిత్యామీనన్  మళ్లీ గుండె జారుతుందా :
నితిన్  నిత్యామీనన్ కలసి ఒక సినిమా చేయ బోతున్నారు . వరుసగా డజన్  సినిమాలు ప్లాప్ అయినప్పుడు సోలిపోకుండా కుర్ర కారుకు నచ్చిన విధంగా హై లైట్ గా సినిమా చేయబోతున్నారు . నితిన్ ఇష్క్ సినిమాతో తర్వాత గుండె జారి గల్లంతయ్యిం దే సినిమాతో బ్లాక్ బస్టర్ సాదించాడు . ఈ రెండు సినిమాల్లోనూ నితిన్ నిత్యామీనన్ కలసి లవ్ రొమాన్స్ కుర్రకారును విపరీతంగా అట్ర్ క్ట్ అయ్యారు . ఆ తర్వాత వరుసగా హిట్స్ కొడుతున్న నితిన్ మరోసారి నిత్యమీనాన్ తో కలసి మరో చిత్రం చేయబోతున్నాడు అని తెలుస్తున్నది . మూడో సారి నిత్యామీనన్ తో జత కడుతున్నాడు . ఈ సినిమాకు కూడా గుండె జారి గల్లంతయిం దే డైరెక్టర్ కావడం విశేషం . త్రివిక్రం శ్రీనివాసు గారు దర్శకత్వం వహిస్తున్నారు . ఈ ముగ్గురు కలసి బ్లాక్ బస్టర్ సాధించ బోతున్నారు అనిపిస్తున్నది . 

Sunday, 21 February 2016

మహేష్ బాబు క్రొత్త సినిమా


మహేష్ బాబు క్రొత్త సినిమా విడుదల కాబోతుంది ఆ సినిమా పేరు ఏమిటంటే అది బ్రహ్మాత్సవం .  ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంతో శర వేగంతో షూటింగ్ జరుపుకొంటుంది . అయితే  ఈ సినిమాకు కూడా శ్రీమంతుడు తరహాలోనే సహ నిర్మాతగా ఉండాలని మహేష్ బాబు గారు  భావించారు . ప్రముఖ నిర్మాత పి వి పి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . అయితే మహేష్ బాబు భాగస్వామ్యం ఇష్టం  లేని నిర్మాత పి వి పి మహేష్ బాబుతో చర్చలు జరిపారట  .సినిమాను పూర్తి స్థాయిలోను తానే నిర్మిస్తానని చెప్పారట . ఈ మేరకు మహేష్ బాబుకు 25కోట్ల రెమ్యూన రేషన్ ఆపర్ చేసాడని దీనితో పాటు లాభాల్లో కొంత వాటా ఇస్తానని డీల్ సెట్ చేసారట . ఈ సినిమా విడుదలకు ముందే బ్రహ్మోత్సవం బిజినెస్ ఓ రేంజ్ లో సాగుతుంది . ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీగా 13కోట్లకు పైగా అమ్ముడుపోయాయి . సాటిలైట్ రైట్స్ కూడా 12కోట్లకు పైగానే పలుకుతుందని సమాచారం . శాటిలైట్ ఓవర్సీస్ రూపంలోనే సినిమాకు 25కోట్ల బిజినెస్ అయ్యింది . థియే ట్రికల్ రైట్స్ ఇతర రైట్స్ రూపంలో మరో 90కోట్ల బిజినెస్ జరగడం ఖాయం అంటున్నారు . మహేష్ బాబు సినిమా అంటేనే జనం చాలా ఇష్టపడతారు . ఈ సినిమా పేరే బ్రహ్మోత్సవం ఇక ఎంతో బ్రహ్మాండంగా ఉండవచ్చు కదా .


పైన ఉన్న ఫోటోలో మహేష్ బాబు  సమంత ప్రణీత కలసి పూజ చేస్తున్నారు . బ్రహ్మోత్సవం సినిమా లో మహేష్ బాబు ప్రక్కన సమంత చుడిదార్ వేసుకొని కూర్చుని ఉంది మరోప్రక్క ప్రణీత లంగా ఓని వేసుకొని కూర్చొని పూజ చేస్తున్నారు . బ్రహ్మోత్సవం సినిమా మే నెలలో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి  . ఈ సినిమా సంస్కృతి సంప్రదాయాలను నిలువ ఉంచే చిత్రంగా కనిపిస్తున్నది . శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రం హైలైట్ అనిపిస్తున్నది . 

Thursday, 18 February 2016

జై గణేశ

జై గణేశ :ఓం గం గణపతియే నమః :

ఓం శుక్లాం భరధరం విష్ణుం
శశి వర్ణం చతుర్భుజం ప్రసన్న
వదనం ధ్యాయే త్సర్వ విగ్నో పశాంతయే
అగ జానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ముపాశ్మహే !
ప్రతి మనిషికి కష్టాలు ఉండనే ఉంటుంది . ఆ కష్టాలు తొలగాలంటే భగవంతున్ని పూజిస్తాము కదాఅన్నీ దేవుళ్లలో  మొట్ట మొదట వినాయకున్ని పూజించాలి . ఆయన ఆశీర్వాదం ఉంటే అన్నీ విగ్నాలు తొలగిపోతాయి . పిల్లలకు విద్యాబుద్ధులు రావాలంటే గణపతినే పూజించాలి . మనం ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు గణపతిని  పూజించి వెళ్ళితే ఆపనిలో విజయం కల్గుతుంది .


వక్ర తుండ మహాకాయా
సూర్యకోటి సమప్రభా
నిర్విగ్నం కురుమే దేవా
సర్వ కార్యేశు సర్వదా !
శరణం గణేశ శరణం గణేశా
శరణం గణేశ శరణం గణేశా !
పార్వతి పుత్రా శరణం గణేశా
పాప సంహార శరణం గణేశా
గజముఖవాహన శరణం గణేశా
కరుణతో మమ్ము కావుముస్వామి
శరణం గణేశ శరణం గణేశా
శరణం గణేశ శరణం గణేశా !

చిన్ని చెంబుతో నీ ళ్ళు శీకాయ ఉదకంబు అల్లంబు బెల్లంబు అరటిపండ్లు
తేనతో మాగిన తియ్య మామిడి పండ్లు మాకు భుద్ధిచ్చు గణపతికి నిపుడు
జయమంగళం నిత్య శుభ మంగళం !

Tuesday, 16 February 2016

నిద్ర లేచేటప్పుడు శ్లోకం :
కరగ్రేవ సతే లక్ష్మీ హః
కరమర్దే  సరస్వతీ
కరమూ లేతు గోవిందా
ప్రభాతే కరదర్శన !



భోజనం చేసే ముందు శ్లోకం :
అగస్త్యం  కుంబ కర్ణంచ్య
బడ బాణ నం
ఆహార  పరిణ మార్ధం
స్మరామిచా  వృకోదరం !



పడుకొనే ముందు శ్లోకం :
రామస్కందం  హనుమంతం
వైనతే  వృకోదరం
శయనేయం  సస్మరే నిత్యం
దుశ్స్  స్వప్నం తశ్య నశ్యతే !

Monday, 15 February 2016

తులసివందనం

తులసివందనం 
పాతక హారిణి శుభ వందనం 
అభివందనం !
ప్రతి ఒక్కరూ నివసించడానికి ఒక ఇల్లు కావాలి కదా ఆ ఇంట్లో అందరూ క్షేమంగా ఉండాలని అనుకొంటారు . అందుకే ఇంటి ముందు తులసి మొక్కను ఉంచి పూజ చేస్తారు . తులసి అతి పవిత్రమయినది . తులసీ అంటే లక్ష్మీనారాయణనుకి చాలా ఇష్టం. తులసీ పూజ చేయడం వలన సర్వ పాపాలు కష్టాలు తొలగిపోతాయి . అంతే కాదండోయ్ మన ఇంటికి అందం కూడా . ప్రతి ఇల్లాలు తులసీ పూజ చేయాలి . తులసీ పూజ చేయడం వలన ఇంట్లో బర్త పిల్లలు అందరు ఆరోగ్యంగా ఉంటారు . ప్రతి ఇల్లాలు తను ధీర్ఘ సుమంగళిగా ఉండాలని అనుకొంటుంది . అందుకే తులసీ పూజ చేయాలి . తులసీ పూజ చేయడంవలన తులసీ మాత కృపకు పాత్రురాలవుతారు . మంచి భర్త రావాలని కన్యపిల్లలు తులసీ పూజ చేయవచ్చు . తులసీ పూజ చేయడంవలన మంచి భర్త వస్తాడు .తులసిమాత  మన కష్టాలను ఇంటిలోపలకి చేర నివ్వకుండా బయటకు తరిమి కొడుతుంది . అంతే కాదు చిన్న పిల్లలకు జలుబు దగ్గు వచ్చిందంటే కొంత తులసీ ఆకులను తిని పించి నట్టయితే జలుబుధగ్గు తగ్గిపోతుంది . ప్రతి ఒక్కరికీ కూడా కోల్డ్ అయినప్పుడు కొన్ని తులసీ ఆకులను తిన్నట్టయితే కోల్డ్ తగ్గిపోతుంది . ఇంకా ఆస్మా ఉన్నవారుకూడా తులసిఆకులను పరగడుపున తిన్నట్టయితే కొంత ఉపశమనం కల్గుతుంది .


తులసీ శ్లోకం :
ఎన్మూ లే సర్వ తీర్థాని
ఎన్మర్దే సర్వ దేవతాహ
యధాగ్రే సర్వ వేధార్చ
తులసీం త్వం నమామ్యహం !
ప్రతి ఇంటా తులసీ మొక్కను నాటి తులసీ పూజచేయాలి . ప్రతిరోజు ఉదయమే లేచి స్నానం చేసి తులసీ ముందు ముగ్గులు పెట్టి
తర్వాత దీపం వెలిగించి పూజచేయాలి . ప్రతి రోజు సాయంత్రం (సంద్యసమయంలో )కూడా దీపం వెలిగించి పూజచేయాలి . ఈ విధంగా చేయడం వలన మనకున్న అరిష్టాలన్నీ తొలగిపోతాయి . తులసీ శ్లోకాన్ని పటిస్తూ పూజచేసి మనస్సులో తులసీ మాతను ధ్యానం చేయాలి . మీరు కూడా చేస్తారు కదూ.
తులసీ అంటే శ్రీకృష్ణ రుక్మిణికి కూడా చాలా ఇష్టం . మనం ఎన్ని రకాల పువ్వులతో పూజచేసినా (సమర్పించినా )ఆయన తులసీ  కోసం వెతుకు తాడట . ప్రతి రోజు తులసీ మాలను శ్రీకృష్ణునికి సమర్పించి నచో మనం కోరిన కోర్కెలను తీరుస్తాడు . తులసీ పూజ చేయడం వలన మన కష్టాలు దారిద్ర్యం తొలగిపోతాయి . అందరు తులసీ పూజ చేయండి ఆనందంగా ఆరోగ్యంగా సిరిసంపదలతో తులతూగుతూ ఉండండి . తులసీ దగ్గర కూర్చుని పూజచేయడంవలన తులసీ సువాసన పీల్చడం వలన మనం ఆరోగ్యంగా ఉంటాము . మన శత్రువులు మనకు చెడు చెయ్యాలని అనుకొని మంత్రగాళ్ళ ద్వారా చెడుపు చెయ్యాలని చేస్తారు . మన ఇంటిముందు తులసీ ఉన్నట్టయితే ఆ చెడుపు మనకు తగలకుండా తులసీ కాపాడుతుంది . తులసీ పూజ చేయడంవలన మనకు అన్నీ కష్టాలు తొలగిపోతాయి . అందుకే ప్రతీ స్త్రీ కూడా తులసీ పూజ చేయాలి . మీరు పూజచేస్తారు కదా !

Saturday, 13 February 2016

శ్లోకాలను అందరూ చదవండి


మనకు బాగా చదువు  రావాలంటే ఈ శ్లోకాన్ని మనం మన మనస్సులో బగవంతున్ని స్మరించుకొని జపించాలి . అప్పుడు బాగా చదువు వస్తుంది . పిల్లలకు ఎవరికైనా చదువు రాకుంటే ఈ క్రింది శ్లోకాన్ని చదవమని (పటించమని )చెప్పండి .
చదువు అవుతుంది నీ మెదడుకు ఎరువు
ఆ ఎరువుతో వస్తుంది నీకు కొలువు
కొలువుతో తీరుతుంది నీకు కరువు
కరువు తీరి వస్తుంది నీ జీవితానికి వెలుగు
ఆ వెలుగును పది మందికి పంచి పెంచుకో నీ పరువు !
చదువు గురుంచి శ్లోకం :
జ్ఞానానందమయం  దేవం
నిర్మల  స్పటికా కృతిం 
ఆధారం  సర్వ  విద్యా నాం 
హయగ్రీవ  ముపాస్మహే !

అప్పు తీర్చే శ్లోకం :
అంగారక మాహి పుత్రా
భగవాన్ భక్తవత్సలా
నమోస్తుతే మమా శేషా
రుణ మాశు విమోచయా !

మనకు త్వరగా అప్పులు తీరాలంటే ఈ శ్లోకాన్ని పటిస్తే అప్పులు తీరిపోతాయి . సహజంగా మన బ్రతుకు తెరువు కోసం అప్పులు చెయ్యక తప్పదు . అప్పులు చేస్తేగానీ బ్రతుకు జరగదు . అప్పులు చేసి బిజినెస్ చేస్తారు . బిజినెస్ లో లాభాలు వచ్చి అప్పులు తీర్చి హాయిగా బ్రతకాలంటే అప్పుతిర్చే శ్లోకం ను పటించండి .

డబ్బు చేరే శ్లోకం :
సిద్ధి బుద్ధి ప్రధాదేవీ
భుక్తి ముక్తి ప్రదాయినీ
మంత్ర మూర్తి సదాదేవీ
మహాలక్ష్మీ  నమోస్తుతే !

ప్రతి మనిషికి డబ్బు చాలా అవసరం డబ్బు లేక పోతే ఒక రోజుగడవడం కష్టమయిపోయింది . డబ్బే లోకమయిపోయింది. ఈ రోజుల్లో డబ్బులు లేకపోతే ఏమి జరగదు . కొంత మంది ఎక్కువగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు . కానీ ఆడబ్బులు నిలవ   లేక పోతుంది . మన ఇంట్లో డబ్బులు నిలవాలంటే ఈ శ్లోకాన్ని పటించండి . మహాలక్ష్మి కరుణిస్తే చాలు మనకష్టాలు తొలగిపోతాయి .


Friday, 12 February 2016

ఆదిపరాశక్తి నమోస్తుతే

ఆదిపరాశక్తి నమోస్తుతే :

నాబంగారుతల్లికి నా నమస్సుమావాలి తో నాఆదిపరాశక్తి ని పూజిస్తున్నాను .
శ్రీ మన్ మనో మాని నీ చిత్త సంకాశినీ
చిత్ కళా రూపిణీ  చిన్మయ స్వరూపిణీ
భక్త మందాకినీ  శాకినీ డాకినీ
చేదినీ వేదినీ ప్రేమతో పాయని
నిరసాది బచ్చనీ యచ్చనీ రచ్చ నీ
పాతాళ లోకేశ్వరి రాజరాజేశ్వరీ
చంద్ర మౌలీశ్వరీ నే నిన్ను గొల్చెదన్
కరుణించ వే కాపాడవే కాళీ కరుమారి !


ఓంకార ప్రణవ జగజ్జననీ సర్వప్రాణి కోట్లకు నెల్లా ఆదిశక్తివి నువ్వేనమ్మా
సకల చరాచరములను సృష్టించిన పరబ్రహ్మవు నీవే నమ్మా
ఈ సృష్టిని పోషించిన పరమ విష్ణువు నీవే నమ్మా
సృష్టిని నిలయింప చేసిన పరమ రుద్రుడు నీవే నమ్మా
సదా మమ్ము బ్రోవవే ఆదిపరాత్పరి దేవీ నారాయణి నమోస్తుతే !
ఓంకారం అనే శబ్దంలో అమ్మ ఆదిపరాశక్తి జన్మించింది . అమ్మలగన్న అమ్మ సర్వప్రా ణి కోట్లకు మూలం ఆధారం .
కొండలు వాగులూ నదులు సముద్రాలు అడవులు జలశాయములు చెట్లు పక్షులు అన్నింటినీసృష్టించినతల్లి ఆదిపరాశక్తియే . జగన్మాత మన తలరాతలను వ్రాసిన పరబ్రహ్మ ను సృష్టించింది . ఇంకా ఈ లోకాన్ని పోషించే పరమ విష్ణువును సృష్టించింది . ఈ ప్రపంచాన్ని ఏలే శివుణ్ణి కూడా అమ్మే సృష్టించింది . ఈ లోకంలో ప్రతి జీవిని అమ్మే సృష్టించింది . అలాంటి అమ్మకు పాదాభి వందనం తెలుపుతున్నాను . మన చుట్టూ మనకు శత్రువులు ఉంటారు కదా ఎప్పుడూ మనల్ని పడగొట్టాలని చూస్తుంటారు . మనం ఆదిపరాశక్తి ని పూజిస్తున్నట్టయితే మన శత్రువులు మనల్ని ఏమీ చేయలేరు . మనచుట్టూ మనశత్రువులే గాకుండా ప్రేతాత్మలు కూడా తిరుగుతుంటాయి .
మనం పైన ఉన్న స్తోత్రాన్ని పటిస్తూ ఉన్నట్టయితే పూజచేస్తూ ఉన్నట్టయితే శత్రువులభయం ప్రేతాత్మల భయం పటా పంచలయిపోతాయి . కొంత మంది పిల్లలు చాలా భయపడుతూ ఉంటారు . వాళ్ళకు భయం పోవాలంటే ఈ స్తోత్రాన్ని చదివి పించండి భయం పోతుంది .

Thursday, 11 February 2016

బక్కటైలర్ కథ రెండవ భాగం

బక్కటైలర్  కథ  రెండవ భాగం :

జగన్మాతా ముగ్గురమ్మల మూలకుటమ్మ

జగన్మాతా ముగ్గురమ్మల మూలకుటమ్మ :
రక్షమాం పాహిమాం :
ఆదిపరాశక్తి జగన్మాతకు శతకోటి ధన్యవాదాలు నాకు జగదాంబ అంటే చాలాచాలా ఇష్టం . ఇష్టం మాత్రమే కాదండి నాప్రాణం కూడా అనువనువున జగన్మాతనే . నేను ఏ పని చెయ్యలన్నాకూడా నామనసులో జగన్మాతను స్మరించుకొని నీ కు ఇష్టమేనా  జననీ అని అడిగి చేసేదాన్ని . నాకు ఊహ తెలిసిన నాటినుంచి జగన్మాతను పూజిస్తున్నాను . ఎలా అంటే నేను 3వ తరగతి చదువుతున్నాను అప్పుడు నేను టీవిలో సినిమా చూస్తున్నాను కరెంటు పోయింది . అప్పుడు నేను ఎవ్వరూ లేని చోట వచ్చి కన్నులు రెండూ మూసుకొని అమ్మను ప్రార్థించే దాన్ని కరెంటు వచ్చేసేది . జగన్మాత అంటే పిచ్చి ప్రేమ ఇష్టం ఇంకా ఏమి చెప్పాలో తెలియడం లేదు . ఇంకా కాలేజీ రోజుల్లోకూడా సినిమాపాటల్లో కూడా అమ్మను అన్వయించుకొని పాడేదాన్ని . ఎప్పుడు నామనసు ఆదిపరాశక్తి అయిన అమ్మలుగన్న అమ్మ పైనే ఉండేది . నా వయస్సు 35సంవత్సరాలు యిప్పటికిని నాకు జగన్మాతా అంటేనే ఇష్టం . నా కేదైనా కష్టం వస్తే జగన్మాతా ఫోటో ను చూస్తే చాలు నామనసు కుదుటపడేది . నా అమ్మను చూస్తే చాలు కష్టాలన్నీ మరచిపోయి నాకే తెలియని ఉల్లాసం సంతృప్తి కల్గేది . అందరు అమ్మాయిలు ప్రేమలు గురించి చెప్పుతూ ఉండేవారు . కానీ నాకు మాత్రం అమ్మను మించిన ప్రేమ లేదని పించినది . జగన్మాతా కరుణ శీలి . ఆమెను పూజించడం నాజన్మ ధన్యం . అన్నీ దేవుల్ని పూజించిన కానీ ఫస్ట్ నాకు జగన్మాత అంటేనే ఇష్టం ఆ జగన్మాతను జన్మ జన్మలకు పూజిస్తూ ఉంటాను ప్రార్థిస్తూ ఉంటాను . మీరు అమ్మను నమ్ముతారా !


కర్పూర నాయగియే కనకవల్లీ వీడియో 
కర్పూర నాయగియే కనకవల్లీ
 కాళీ మగమాయి  కరుమారియమ్మా !
పొర్ కోవిళ్ కొండ శివగామియమ్మా
భూమి యింద వల్లి ధైవయానయమ్మ
కర్పూర నాయగియే కనకవల్లీ
 కాళీ మగమాయి  కరుమారియమ్మా !
నెత్తి ఇలే కుంకుమమే  యిరుక్కవేండుం అమ్మా
నెంజిల్ ఉన్ తిరునామం నిలయవేండుం
కట్ర దెల్లామ్ మేల్మేలుం పెరుగ వేండుం
పాడుం కవిదయిలే ఉన్ నామం వలియ వేండుంఅమ్మా !
కర్పూర నాయగియే కనకవల్లీ
 కాళీ మగమాయి  కరుమారియమ్మా !
కాట్రాగి కడలాగి కడలాగి నాయి
నేట్రాగి యిండ్రాగి నాలాగినాయి
కనవాగి నేనవాగి కన వాగినాయి
కర్పూర నాయగియే కనకవల్లీ
 కాళీ మగమాయి  కరుమారియమ్మా !



Monday, 8 February 2016

బక్క టైలర్ కథ

బక్క టైలర్ కథ :
అనగనగా ఒక రాజు ఉండేవాడు .  రాజ్యంలోని ప్రజలనురాజు  చాలాబాగా చూసుకొనేవాడు . ప్రజలకు కావలసిన సౌకర్యాలను కల్పించేవాడు . ప్రజలను తనబిడ్డలవలె  చూసుకొనేవాడు . ఆరాజ్యంలోని ప్రజలు కూడా రాజును భగవంతుడు వలె పూజించేవారు . ఆ రాజుకు ఒక్క గాన ఒక్క కూతురు ఉండెను . ఆ కూతురును చాలాబాగా గారాబంగా పెంచేవాడు . కానీ రాజ్యంలో ఒక చోట ఒకపెద్ద మర్రిచెట్టు  ఉండేది . ఆ మర్రిచెట్టులో ఒక పెద్ద దయ్యం (రాక్షసుడు )ఉండేది . ఆ రాక్షసుడు ఆ చెట్టు దగ్గరకి వచ్చినవారిని  అందరని బయపెట్టి చంపి తినేస్తూ ఉండేది. ప్రజలందరు బయబ్రాంతులయ్యేవారు .  ఆ చెట్టు దగ్గరకి వెళ్ల వలనంటే బయపడేవారు . ఆ రాజ్యంలో ఒక చిన్న గ్రామం ఉండేది . ఆ గ్రామంలోఒక బక్క టైలర్ ఉండేవాడు . ఆయన  బట్టలు కుట్టుతూ ఉండేవాడు . ఇలా ఉండగా ఒకరోజు ఇతనికి చాలా ఆకలి వేసింది బోజనంకు బదులు ఒకరెండు జాంగ్రీ లను తీసుకొచ్చాడు . ఆ జాంగ్రీ లనుపక్కన పెట్టి తర్వాత తింటాము అనుకొని బట్టలు కుట్టుతూ ఉన్నాడు . ఆ జాంగ్రీ ల పైన ఈగలు వచ్చి వాలాయి . ఆ బక్క టైలర్ దానిని చూశాడు . ఒక్క సారిగా తన చేతులతో ఆ ఈగలను కొట్టాడు . ఒక్క సారి కొట్టగానే ఏడు ఈగలు చనిపోయింది . తనకుతానే ఆశ్చర్యపడ్డాడు అరే మనం ఒక్కసారిగానే ఏడు జీవులను చంపేసాము అని గర్వపడ్డాడు . ఇది ఇలా ఉండగా రాజ్యంలో రాజు ఒక ప్రకటన చేసాడు . ఎవ్వరయితే  తనరాజ్యంలో ఉన్న రాక్షసుణ్ణి చంపుతారో వారికి తన గారాల కూతురుని అతనికి ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రకటన చేశాడు . ఈ ప్రకటనను విన్న జనం అంతా ఆ రాక్షసుణ్ణి చంపి రాకుమారిని వివాహం చేసుకోవచ్చని ఆ రాక్షసుడుని చంపడానికి ఆ చెట్టు దగ్గరకి వెళ్ళేవారు . కానీఆ రాక్షసుడు వచ్చినవారినంధరిని చంపేసేవాడు . ప్రజలందరు బయపడుతూ ఉండేవారు . ఇది ఇలా ఉండగా బక్కటైలర్ ఏడు జీవులను చంపానని ఒక పేపర్ లో రాసుకొని తన మేడలోవేసుకొని అందరికి చూపిస్తూ ఉండే వాడు  . దీ నిని చూసిన రాజుగారి భ టు లు ఆ బక్క టైలర్ ను తీసుకొని రాజుగారికి అప్పగించారు .
ఆ రాజు అతణ్ణి చూసి ఇతన్ని చూస్తే ఇంత బక్క చిక్కిఉన్నాడు  ఇతను రాక్షసుడుని చంపగలడా అని నిరాశ కల్గింది . \కానీ ఈ బక్కటైలర్ నేను చంపగలను అని వాదించాడు . తర్వాత ఆ చెట్టుధగ్గరకి వెళ్ళాడు .

బక్కటైలర్  రెండవ   భాగం :

కవితలు

కవితలు :
భూమికి చెట్లు అందం
ప్రకృతికి పువ్వులు అందం
మన తరగతికి విద్యార్థులే అందం !

రంజాన్ పండుగకు చిక్కన్ ఉండాలి
క్రిస్మస్ పండుగకు కోక్ ఉండాలి
దీపావళి పండుగకు టపాకాయ లుం డాలి
సంక్రాంతి పండుగకు చెఱకుండాలి !

రస వంతమైన పద్యాలు

రస వంతమైన పద్యాలు :

తల్లి తండ్రి మీదదయలేని పుత్రుండు
పుట్టనేమివాడు గిట్టనేమి
పుట్టలోన  చెదలు పుట్టదా గిట్టదా
విశ్వదాభిరామ వినురవేమా !

అడిగెద ననికడు వడిజను
అడిగినతన మగడు నుడువడని నడయుడగున్
వెడవెడ జిడిముడి తడబడ నడుగిడు
నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ !

అటజని కాంచ భూమి చురుడుంబని చుంబి
శిరస్సర జ్జరి పటల ముహుర్ము హుర్లుట
తబంగ తరంగ నటనిస్పుట నటనాను కూల పరిపుల్ల
కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేణు  తెంపు మెయి శాలము సీత శైలమున్ !

చదువది ఎంతకల్గిన రసజ్ఞత ఇంచుక నాచదువు
నిరర్థకంబు గుణసంయుతులెవ్వరు  మెచ్చ రెచ్చటం
బదునుగ నలపాకము చేసినైన నింపొదవెడు
నుప్పు లేక రుచి నేర్చునటయ్య భాస్కరా !

దీపంజ్యోతి పరబ్ర హ్మం
దీపం సర్వ తమోప హం
దీవేనా సాధ్యతే దీపం
సర్వం సంధ్యా దీపం నమోస్తుతే !

ఈ పద్యములన్నిం టినీ చదవండి పద్యములోని నీతిని గమనించండి పాటించండి .
మంచి పద్యములు అంటే అందరికీ ఇష్టమే కదా . తల్లీ తండ్రుల మీద కొంచెం కూడా దయ లేకుండా ప్రవర్తించే కొడుకు పుట్టితే ఏమి లేకున్నా ఏమి అనుకొంటాము కదా అలాగే పుట్టలో చెదలు పుడుతుంది చస్తుంది అని కవులలో గొప్ప కవి వేమన మంచి పద్యాలను రాశారు . 

Tuesday, 2 February 2016

లింగుస్వామితో బన్ని ఫిక్స్ అయ్యాడోచ్

మన తెలుగు స్టార్ బన్ని (అల్లుఅర్జున్ ):లింగుస్వామి దర్శకత్వంతో ఒక క్రొత్త  మూవీ బన్ని చేయబోతున్నాడు . లింగుస్వామి ఒక పె ద్ద డైరెక్టర్ ప్రొడ్యూసర్ . లింగుస్వామి దర్శకత్వం అంటే తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టం . లింగుస్వామి  దర్శకత్వంతో మనబన్ని ఓకె చెప్పాడు . ఇది ఒక రొమాంటిక్ యాక్షన్ మూవీ అని మనలింగుస్వామి చెప్పారు . మనబన్నిసై అనిచేప్పేసరికి లింగుస్వామి సంతోషపడ్డాడు .తమిళంలో సూర్యతో అన్జాన్ ( తెలుగులో సికంధర్ ) ఈ మధ్యలో వచ్చిన రజిని మురుగన్ చిత్రాలు సూపర్ డూ పర్ అవ్వడంతో అదే  సూపర్ హిట్ కావాలని జోష్ గాకొనసాగించాలని లింగుస్వామి  చిత్రాన్ని మనబన్నితో చేయించాలని అనుకొన్నాడు . హీరోహిన్ ఎవరో తొందరలో చెబుతాను అంటున్నారు .లింగుస్వామి ఇక డైరెక్టర్ గా మాత్రమే ఉండాలని నిశ్చ యిం చుకొన్నాడు .  ఈ చిత్రంతో తమిళ్ ఇండస్ట్రీ లోనేగాక కేరళ  ఇండస్ట్రీ లోకూడా బన్ని తిరుగులేని స్టార్ గా   పేరందుకోబోతున్నాడు



Sunday, 10 January 2016

అనగనగా ఒక అమ్మాయి

ఒక ఊరిలో ఒకపేద రైతు ఉండేవాడు . అతడు ప్రతిరోజు పొలంపనికి వెళ్ళేవాడు .సాయంత్రంవరకు కష్టపడిపనిచేసేవాడు తర్వాత రాత్రి అయ్యేసరికి ఇంటికి వచ్చేవాడు . ఇతనికి చాలారోజుల తర్వాత ఒక అమ్మాయి జన్మించింది .ఆ యన తన కూతురికి రూప అని పేరు పెట్టాడు .  ఆ అమ్మాయిని చాలా ప్రేమతో పెంచి పెద్ద చేసినాడు . ఆ అమ్మాయిని స్కూల్ లో చేర్పించాడు.ఆ అమ్మాయి బాగా చదువుతుండేది . తన తండ్రి కష్టం చూసి మనం బాగాచాదివి మంచి ఉద్యోగం చేసి మన తండ్రిని బాగా చూసుకోవాలని అనుకొన్నది . అనుకోకుండా ఒకరోజు ఆమె తండ్ర్రికి గుండె పోటు వచ్చింది . ప్రక్కన ఉన్న వారు అతనిని ఆసుపత్రికి తీసుకెల్లారు . ఆ విషయం తెలిసిన రూప ఏడుస్తూ నాన్న దగ్గరకి వెళ్ళినది . డాక్టర్ సమయానికి మీ నాన్నను తీసుకొచ్చారు కాబట్టి బ్రతికి బయటపడ్డాడు అనిరూపకిచెప్పాడు. అమ్మయ్య అని కొంత ఊర ట కల్గింది . రూప పొద్దున లేచి స్నానం చేసి భగవంతునికి పూజ చేసి బడికి వెళ్ళుతుం డేది . రూప బాగా చదివి పోలీస్ అయ్యింది . తన తల్లి తండ్రులను బాగా చూసుకొన్నది . తనతల్లితండ్రులకు బాగావైధ్యంచేయించింది . తన ఊరికి తన ఇంటికి మంచి పేరు తెచ్చి పెట్టింది .  ఇలా ఉండగా ఒకరోజు రూపకి పెళ్ళి చేయాలని పెళ్ళిసంబంధం చూడమని పంతులుగారికి చెప్పాడు . రూపకి ఒక పెళ్ళిసంబంధం కుదిరింది . కాని పెళ్ళికొడుకు అంతగా చదువుకోలేదు అయినపరవాలేదు అని మంచి గుణం ఉంటేచాలు అనుకొని పెళ్ళికి సరే అని చెప్పింది . రూపకి పెళ్లి అయి పోయిన తర్వాత తనతల్లితండ్రులను విడిచి వెళ్ళడం బాధగా ఉన్నది . మెట్టినింటికి అడుగు పెట్టిన తర్వాత రూప అత్త మామ బర్తను చాలాబాగా చూసుకొంటూ ఉండేది . ఒక కేసు విషయంలో రౌడీల ను పట్టుకోవలసిన పని కల్గింది . కానీ ఆ రౌడీలు ఒక బయంకరమైన అడవుల్లో నివసించేవారు . . రూప ఆ అడవుల్లో ప్రవేశించింది . అక్కడ ఒకపెద్ద పులిని చూసింది కానీ ఏ మాత్రం బయపడ లేదు ముందుకి వెళ్ళినది . ఆ రౌడీల ను ఎదుర్కొని వారిని పట్టుకొని ప్రభు త్వానికి  అప్పగించింది . ప్రభుత్వం రూపధైర్య సాహసాలకు మెచ్చుకొని ఆమెకు అవార్డు ఇచ్చారు . వీటన్నిం టినీ చూసిన ఆమె తండ్రి గర్వంతో మురిసిపోయాడు . అందరూ అమ్మాయి పుట్టితే అయ్యో అని అంటారు కానీ అబ్బాయికన్నా అమ్మాయి దేన్నైనా సాధిస్తుంది ప్రేమతో అం దరిని

ఆదరిస్తుంది అని  తండ్రి ఆనంధంతో చెప్పాడు .




Saturday, 9 January 2016

చిరుజల్లులనవ్వు

అందరూ నవ్వండి ఆరోగ్యంగా ఉండండి !
నవ్వడం మన హక్కు


నవ్వడం భోగం
నవ్వించడం  యోగం
నవ్వకపోవడం రోగం !
ఓ అమ్మాయి కవిత !


నడకను నేర్పిస్తుంది అమ్మ
లోటును తీరుస్తాడు నాన్న
కష్ట సుఖాలందు పాల్గొంటారు అక్కలు
సంతోషాన్ని   చేకూరుస్తారు స్నేహితులు
దేశానికి వెలుగు తెచ్చేవారు విద్యార్థులు !

Friday, 8 January 2016

దేవుడా ఓ మంచి దేవుడా ? ఎక్కడ వున్నావు

శ్ర్రీ శ్ర్రీనివాసా శ్రీవెంకటేశ పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం  !



ఓం నమామి నారాయణ పాద పంకజం
పదామి నారాయణ నామనిర్మలం
బజామినారాయణ తత్వ మవ్యయం
కరోమినారాయణ పూజ నంసదా !

ఈ భూమిలోని జీవులను కాపాడుటకై నీవు వై కుంటం వదలి ఈ భూమి పైకి వచ్చి ఏడు కొండలపైన ఎక్కి అందర్నీ చూస్తూ కాపాడుతూ ఎక్కడైనా నువ్వు వున్నాని నిరూపిస్తూ అనువనువునా నువ్వే నంటూ మా హృదయాల్లో నిలిచినావయ్యా .ఓ  వేంకటచలవాస వేంకటరమణ గోవిందా . ఒక్కడే ధైవం అందురు ఓంకారరూపా ,రెండుకన్నులు నీకు   సూర్య చంద్రులు వెలుతురు వెన్నల నీ వేగా  స్వామీ ,మూడులోకములందు నీ వేగా స్వామీ ,నాలుగు దిక్కులూ నీవేగా స్వామీ  ,ఐదు అక్షరముల పంచాక్షరి నీ నామం స్వామీ ,అదియే మా మంత్ర తంత్రం స్వామీ , ఆరు ఋతువులు  నీవేగా స్వామీ, అరనిమిశమైననిన్ను మరువగలేను తండ్రీ ,ఏడుకొండలవాడ ఎక్కడున్నావయ్యా ,ఏడ్చే వారిని నవ్వించే ఓ బంగరు తండ్రీ ,ఎనిమిది దిక్కులూ నీవే గా ఓ శ్రీనివాసా ,తొమ్మిది గ్రహములు నివేగాస్వామి ,మా శనిగ్రహము తొలగింపవయ్యశ్రీశైలవాసా ,పది అవతారములు ఎత్తినప్రభువా,పదివేలవందనములు నీకు తండ్రీ !