పూర్వ కాలంలో హిరణ్యక శిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు . ఇతను లీలావతి అనే ఆమెను వివాహం చేసుకొనెను . ఇతను తన చుట్టూ ఉన్న రాజ్యాలలో ఉన్న రాజులను ఓడించి రాజ్యములను ఆక్రమించు కొనెను . ఇతను ఒకరోజు తన బార్యతో నేను అడవిలో తపస్సుకు వెళుతున్నాను అని చెప్పి నీవు జాగ్ర త్త అని అడవికి వెళ్ళెను . హిరణ్యకశిపుడు అడవికి వెళ్ళి ఈశ్వరుని గురించి తపస్సు చేసెను . ఇది ఇలాఉండగా ఇతని బార్య లీలావతి నెలతప్పి గర్బం ధరించెను . ఈమె పతివ్రతా శిరోమణి . పతి అడవికి వెళ్ళినాడని చింతతో మధనపడుతుండగా నారదమహర్షి ఆమెను చూసి అమ్మా నీవు బాధపడకు నీపతి వచ్చే వరకు నీవు ఆశ్రమంలో బగవంతుని సేవ చేసుకొంటూ ఉండు అని ఆమెను తనతో తీసుకొని వెళ్ళెను . ఆమె ఆశ్రమంలో ప్రతీ రోజూ బగవంతుని పూజిస్తూ ఉండేది .ఆమె కడుపులో ఉన్న బాలుడు కూడా ఆమె చేస్తున్న పూజలన్నీ ఈ బాలుడుకూడా వింటూ ఉండేవాడు .
ఒక మంచి ముహూర్తాన ఆమె ఒకబాలుడికి జన్మ ఇచ్చింది . నారద మహర్షి ఈ బాలుడికి ప్రహ్లాదుడు అనే నామకరణం చేసెను . ఆమె బర్త హిరణ్యకశిపుని తపస్సు పలించి పరమశివుడు ప్రత్యక్షమయ్యెను . బక్తా నీకు ఏమి
వరం కావలెనో కోరుకోఅనెను . అప్పుడు హిరణ్యకశిపుడు నాకు ఎటువంటి జీవరాసితో కానీ మానవుడు తోను కానీ మరణం సంబవించ కూడదని వరం కోరుకొనెను . అప్పుడు పరమశివుడు తధాస్తు అని దీవించెను . తర్వాత ఇతను అడవి నుండి తిరిగి రాజ్యమునకు వచ్చెను . రాజ్యంలో తన బార్య లేదని గ్రహించి తన బార్య దగ్గరకు వెళ్ళి తన బార్యను తీసుకొని వచ్చెను . తన పుత్రుని చూసి సంతోషంతో ఉండెను .ప్రహ్లాదుడికి ఐదు సంవత్సరాలు నిండిందికావున ప్రహ్లాదుడికి విద్య నేర్పించడానికి బోధన అబ్యాసనం చేయడానికి హిరణ్యకశిపుడు తన కుమారుని పిలిచి నాయనా నీవు విద్యా బోధనకు ఆశ్రమానికి వెళ్ళు అని ఆశ్రమానికి పంపెను . హిరణ్యకశిపుడు నేనే బగవంతున్ని అని రాజ్యంలో అందరిని ఓం హిరణ్యకనమః అని నామ స్మరణ చేయవలెనని ప్రకటన చేసెను .
రాజ్యంలోని ప్రజలందరు కూడా హిరణ్యకశిపుడే దేవుడు అని ఇతనికి బయపడి ఆయననే పూజిస్తూజపం చేస్తూ ఉండేవారు . ఇది ఇలా ఉండగా ప్రహ్లాదుడు తన గురువు దగ్గర విధ్యాబ్యాసం చేస్తున్నాడు . హిరణ్యకశిపుడు ఇతని గురువుకు కూడా తానే దేవుడు అని తన కుమారునికి కూడా చెప్పాలి అని చెప్పెను . గురువు కూడా ప్రహ్లాదునికి మీ తండ్రియే దేవుడుఅని ఓం హిరణ్యాకాయనమః అని ఉపదేశం చేసెను . కానీ ప్రహ్లాదుడు శ్రీమన్ నారాయణుడే బగవంతుడు అని ఓంనమో నారాయణాయనమః అని ధ్యానం చేసేవాడు . దీన్ని చూసినగురువు మీ నాన్న దగ్గర చెప్పకు మా ప్రాణం పోతుంది ఆయన లేనప్పుడు బగవంతుని స్మరించుకో అని చెప్పెను .

No comments:
Post a Comment