ఒక ఊరిలో ఒకపేద రైతు ఉండేవాడు . అతడు ప్రతిరోజు పొలంపనికి వెళ్ళేవాడు .సాయంత్రంవరకు కష్టపడిపనిచేసేవాడు తర్వాత రాత్రి అయ్యేసరికి ఇంటికి వచ్చేవాడు . ఇతనికి చాలారోజుల తర్వాత ఒక అమ్మాయి జన్మించింది .ఆ యన తన కూతురికి రూప అని పేరు పెట్టాడు . ఆ అమ్మాయిని చాలా ప్రేమతో పెంచి పెద్ద చేసినాడు . ఆ అమ్మాయిని స్కూల్ లో చేర్పించాడు.ఆ అమ్మాయి బాగా చదువుతుండేది . తన తండ్రి కష్టం చూసి మనం బాగాచాదివి మంచి ఉద్యోగం చేసి మన తండ్రిని బాగా చూసుకోవాలని అనుకొన్నది . అనుకోకుండా ఒకరోజు ఆమె తండ్ర్రికి గుండె పోటు వచ్చింది . ప్రక్కన ఉన్న వారు అతనిని ఆసుపత్రికి తీసుకెల్లారు . ఆ విషయం తెలిసిన రూప ఏడుస్తూ నాన్న దగ్గరకి వెళ్ళినది . డాక్టర్ సమయానికి మీ నాన్నను తీసుకొచ్చారు కాబట్టి బ్రతికి బయటపడ్డాడు అనిరూపకిచెప్పాడు. అమ్మయ్య అని కొంత ఊర ట కల్గింది . రూప పొద్దున లేచి స్నానం చేసి భగవంతునికి పూజ చేసి బడికి వెళ్ళుతుం డేది . రూప బాగా చదివి పోలీస్ అయ్యింది . తన తల్లి తండ్రులను బాగా చూసుకొన్నది . తనతల్లితండ్రులకు బాగావైధ్యంచేయించింది . తన ఊరికి తన ఇంటికి మంచి పేరు తెచ్చి పెట్టింది . ఇలా ఉండగా ఒకరోజు రూపకి పెళ్ళి చేయాలని పెళ్ళిసంబంధం చూడమని పంతులుగారికి చెప్పాడు . రూపకి ఒక పెళ్ళిసంబంధం కుదిరింది . కాని పెళ్ళికొడుకు అంతగా చదువుకోలేదు అయినపరవాలేదు అని మంచి గుణం ఉంటేచాలు అనుకొని పెళ్ళికి సరే అని చెప్పింది . రూపకి పెళ్లి అయి పోయిన తర్వాత తనతల్లితండ్రులను విడిచి వెళ్ళడం బాధగా ఉన్నది . మెట్టినింటికి అడుగు పెట్టిన తర్వాత రూప అత్త మామ బర్తను చాలాబాగా చూసుకొంటూ ఉండేది . ఒక కేసు విషయంలో రౌడీల ను పట్టుకోవలసిన పని కల్గింది . కానీ ఆ రౌడీలు ఒక బయంకరమైన అడవుల్లో నివసించేవారు . . రూప ఆ అడవుల్లో ప్రవేశించింది . అక్కడ ఒకపెద్ద పులిని చూసింది కానీ ఏ మాత్రం బయపడ లేదు ముందుకి వెళ్ళినది . ఆ రౌడీల ను ఎదుర్కొని వారిని పట్టుకొని ప్రభు త్వానికి అప్పగించింది . ప్రభుత్వం రూపధైర్య సాహసాలకు మెచ్చుకొని ఆమెకు అవార్డు ఇచ్చారు . వీటన్నిం టినీ చూసిన ఆమె తండ్రి గర్వంతో మురిసిపోయాడు . అందరూ అమ్మాయి పుట్టితే అయ్యో అని అంటారు కానీ అబ్బాయికన్నా అమ్మాయి దేన్నైనా సాధిస్తుంది ప్రేమతో అం దరిని
ఆదరిస్తుంది అని తండ్రి ఆనంధంతో చెప్పాడు .
ఆదరిస్తుంది అని తండ్రి ఆనంధంతో చెప్పాడు .


