ముత్యాల ముగ్గులు :
ప్రతి స్త్రీ ప్రతీ రోజు ఉదయాన్నే నిద్రలేచి తన ఇంటి ముందు (కలేపు) నీళ్ళు చల్లి ఊడ్చి ముగ్గులు పెట్టాలి . అప్పుడే ఆ ఇంటికి అందం .ఇంటి ముందు ముగ్గులు ఉంటే చాలు చూడడానికి అందంగా ఉంటుంది . ఇలా శుభ్రంగా ఏ ఇల్లు అయితే ఉంటుందో యింట్లో లక్ష్మీ దేవి ఉంటుంది . లక్ష్మీదేవికి కూడా ముగ్గులు అంటే చాలు ఇష్టం . పూర్వ కాలంలో లక్ష్మీ దేవి వేకువజామున వీధిలో నడుచుకొని ఏ ఇంటికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఒక ఇంటికి వెళ్ళింది . యింట్లో అందరు నిద్ర పోతున్నారు . అది చూసి వెనక్కి వెళ్ళిపోయింది . తర్వాత మరో ఇంటికి వెళ్ళింది .ఆ యింట్లో ఆ ఇంటి ఇల్లాలు తల విరబోసి పేనులు చూసుకొంటూ తల దువ్వు కొంటూ కనిపించారు .
తర్వాత లక్ష్మీదేవి మరో ఇంటికి వెళ్ళింది . ఆ ఇంట్లో ఇల్లాలు ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిముందు నీళ్ళు (కలేపు)చల్లి ముగ్గులు పెట్టి పూజచేస్తూ కనిపించింది . దీన్ని చూసిన లక్ష్మీ దేవి ఆ ఇంట్లోనే కూర్చున్నది. ఆ ఇల్లు ఐశ్వర్యం తో సిరి సంపదలతో తుల తూగుతూ విరాజిల్లింది . అందుకే మనం కూడా ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసిఇంటి ముందు ముగ్గులు పెట్టాలి . మనకు పండగలు వస్తే చాలు మొదట ముగ్గులు పెడతాము . ముగ్గులు పెట్టగానే పండగ వచ్చినట్టే అనిపిస్తుంది . ముఖ్యంగా సంక్రాంతి పండుగ వస్తే మొదట ముగ్గులు పెడతారు . సంక్రాంతి పండుగ అంటే ముగ్గులు పండుగ అంటారు కదా .

No comments:
Post a Comment